అకాల వర్షంతో తీవ్ర నష్టం

చిత్తూరు: జిల్లాలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో నిన్న చాలా చోట్ల భారీవర్షం కురిసింది. దీనికి తోడు గాలులు వీయడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో ఎక్కువగా మామిడి సాగవుతోంది. ఈ అకాల వర్షం, గాలులతో చాలా చోట్ల మామిడి కాయలు నేలరాలాయి. వెదురుకుప్పం మండలంలోని మారేపల్లి, చవటగుంట, నల్లవెంగనపల్లి, తిరుమలయ్య పల్లిలో వరి నేలవాలింది. మీకు ఇలా నష్టం జరిగిందా?.