చైత్ర పౌర్ణమి సందర్భంగా చండీ హోమం

చైత్ర పౌర్ణమి సందర్భంగా చండీ హోమం

ప్రకాశం: మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ సమీపంలో వెలిసిన ముద్దసానమ్మ ఆలయంలో శనివారం చండీ హోమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈనెల 12వ తేదీ చైత్ర పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఏడు గంటలకు చండీ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చండీ హోమంలో పాల్గొనే భక్తులు కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు.