పదో తరగతి పరీక్షలకు 654 మంది విద్యార్థులు
PLD: ఈనెల 16న జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎంఈవో రవి కుమార్ అన్నారు. శుక్రవారం కారంపూడిలోని తమ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మండలం మొత్తం 654 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కారంపూడిలోని మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.