ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంపా జిల్లాలో కారు, ట్రక్కు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.