పోలీసులకు చుక్కలు చూపిన దొంగ

పోలీసులకు చుక్కలు చూపిన దొంగ

WGL: నగరంలో దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న ఓ దొంగ మామునూర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసుల కళ్లుకప్పి సోమవారం పారిపోయాడు. విచారణ నిమిత్తం నలుగురు దొంగలను ఉంచిన సమయంలో ఒక్కసారిగా ఓ వ్యక్తి ఉడాయించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణమే వెంబడించిన పోలీసులు అరగంట పాటు పొలాలు, చెట్ల మధ్య గాలించి చివరకు దొంగను పట్టుకుని మళ్లీ స్టేషన్‌కు తరలించారు.