పుంగనూరు డివిజన్ అధికారులతో సమీక్ష

CTR: పుంగనూరు డివిజన్‌లోని AOలు, APCNF సిబ్బందితో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని వారికి సూచించారు. డివిజన్లో 92,697 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 51,270 మంది రైతులు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యకు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు.