మేడ్చల్ జిల్లాకు యూరియా స్టాక్..!
MDCL: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు యూరియా స్టాక్ వచ్చింది. అధికారులు వివిధ దుకాణాలకు స్టాక్ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 7,800 బస్తాలు అందుబాటులో ఉన్నాయి. కావలసిన రైతులు ఫర్టిలైజర్ (Fertilizer) యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదటి ఫేజ్లో యూరియా తీసుకొని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.