VIDEO: సోషల్ మీడియాలో రెచ్చగొట్టొద్దు: ఎస్పీ
ADB: మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి ప్రారంభం సందర్భంగా తలమడుగు మండలం సుంకిడి, తలమడుగు గ్రామాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు. ఎన్నికల నియమాలను తప్పక పాటించాలని ఆయన ప్రజలకు తెలియజేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దని, నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. విజయోత్సవ ర్యాలీలు జరపవద్దని సూచించారు.