నకిలీ పత్రాలతో మోసం.. ఐదుగురు అరెస్ట్
MNCL: నకిలీ భూమి పత్రాలు చూపెట్టి మోసం చేసిన ఐదుగురు వ్యక్తులకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్ వివరాల ప్రకారం గణేశ్ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమికి సతీశ్ పేరు మీద నకిలీ డాక్యుమెంట్స్ చూపెట్టి సాగర్ వద్ద రూ. 31,80 లక్షలు తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.