రోడ్డు భద్రతపై వాహనదారులతో ప్రతిజ్ఞ
VKB: ప్రతిఒక్క వాహనదారుడు రోడ్డు భద్రత విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని చెన్గోముల్ ఎస్సై భరత్ రెడ్డి సూచించారు. గురువారం పూడూరు మండలం మన్నెగూడ, పరిగి-మన్నెగూడ రోడ్‌లో జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు ఎలా దాటాలనే విషయంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని కోరారు.