బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరిక
BHPL: రేగొండ మండలం గూడెపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొల్గూరి రాజేశ్వర్ రావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరానని రాజేశ్వర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరుల పాల్గొన్నారు.