ఓట్ల పండుగ..చలిలో వేడెక్కుతున్న రాజకీయాలు!
NLG: చలికాలంలో గ్రామపంచాయతీ ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓటర్ల పండుగ వచ్చిందంటే చాలు, అభ్యర్థులకు ఓటర్లంటే ఎక్కడ లేని ప్రేమ మొదలవుతుంది. అభివృద్ధి చేస్తాం, ఆదరించండి అంటూ ప్రతి అభ్యర్థి ప్రతి ఇంటి తలుపులు తట్టుతూ చేరుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలు.