కశింకోటలో పంచాయతీ కార్మికుల సమ్మె
AKP: కశింకోటలో ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు శనివారం సమ్మె చేపట్టారు. 5 నెలలుగా వేతనాలు బకాయి కావడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మెబాట పట్టామని తెలిపారు. బకాయి వేతనాలు చెల్లించాలి, రక్షణ పరికరాలు, యూనిఫారం, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.