గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సందర్శించిన కలెక్టర్
మన్యం: కురుపాంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, వసతులు, విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. కాసేపు విద్యార్ధులతో ముచ్చటించారు.