దోర్నాలలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

ప్రకాశం: దోర్నాల ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అటవీ అధికారులు నిర్వహించారు. అడవులు, వన్యప్రాణుల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అటవీ సిబ్బంది చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో దోర్నాల, కొర్రప్రోలు రేంజర్లు హరి, ఖాజా రహంతుల్లా, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.