తిరుపతి జిల్లాకు రాష్ట్రపతి, గవర్నర్ రాక
TPT: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ ఈనెల 16, 17 తేదీల్లో తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ డా. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో రేణిగుంట విమానాశ్రయంలో సమావేశమయ్యారు. భద్రతకు సంబంధించిన అంశాలపై, ఏర్పాట్లపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, అధికారులు పాల్గొన్నారు.