'రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
ప్రకాశం: కనిగిరి బైపాస్ రోడ్‌లో స్పీడ్ బ్రేకర్లను, ప్రమాద సూచికల డ్రమ్ములను, మార్క్స్‌ను పోలీసు శాఖ శనివారం ఏర్పాటు చేశారు. వాటిని డీఎస్పీ పీ. సాయి ఈశ్వర్ యశ్వంత్ పర్యవేక్షించారు. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు.