‘ఓటమిలోనూ మోదీ అండగా నిలిచారు’
ప్రధాని మోదీపై మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ప్రధాని మోదీ ఎల్లప్పుడూ క్రీడాకారుల వెన్నంటే నిలుస్తారు. 2017 మహిళా వరల్డ్ కప్‌లో భారత జట్టు ఫైనల్లో ఓడిపోయి, చాలా నిరాశగా ఇంటికి వచ్చింది. ఆ సమయంలోనూ మోదీ మా అందరిని ఇంటికి పిలిచి, మాట్లాడి ఉత్సాహం నింపారు. ఓటమి సమయాల్లో అండగా నిలబడటం చాలా గొప్ప విషయం' అని పేర్కొంది.