VIDEO: జూబ్లీహిల్స్‌లో మంత్రులకు నిరసన సెగ

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఇంజినీర్స్ కాలనీలో రూ.1.11 కోట్ల వ్యయంతో నిర్మించబోయే సీసీ, బీటీ రోడ్ల శంకుస్థాపనకు మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హాజరయ్యారు. అయితే స్థానిక మహిళలు అడ్డుకుని మంత్రులకు వ్యతిరేకంగా నినదించారు. ప్రభుత్వ పథకాలు తమ వరకు రాకపోవడం, నిరుపేదలకు ఉచిత విద్యుత్ అందడంలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.