భక్తులతో కీటకిటలాడిన శ్రీ ఏక చక్రేశ్వరాలయం

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వరాలయంలో రెండవ సోమవారం పురస్కరించుకొని భక్తులతో కిటకిట లాడింది. ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక లఘు రుద్రాభిషేకం బ్రాహ్మణోత్తములచే నిర్వహించినట్లు అర్చకులు గణేష్ శర్మ తెలిపారు. ఆలయంలో అన్న పూజ, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో రాములు అభివృద్ధి కమిటీ సభ్యులు హరికాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.