'డెంగ్యూ వ్యాధిపై అప్రమత్తం అవసరం'

SKLM: డెంగ్యూ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం డీఎంహెచ్ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2021 నుంచి డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆకస్మాత్తుగా కండరాలు, నొప్పులు లక్షణాలు కనిపిస్తే వైద్యలను సంప్రదించాలన్నారు.