ఉప్పొంగిన చెరువు.. నిలిచిన వాహనాలు

ఉప్పొంగిన చెరువు.. నిలిచిన వాహనాలు

WNP: భారీ వర్షాల కారణంగా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని చిన్నకత్వ చెరువు అలుగు పారుతోంది. దీంతో మూలమల్ల నుంచి ఆత్మకూరు వెళ్లే దారిలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు దగ్గర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ విషయంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.