ట్యాంకర్‌పై కుమార్తెతో కలిసి కిమ్ షికారు

ట్యాంకర్‌పై కుమార్తెతో కలిసి కిమ్ షికారు

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏ(13)తో కలిసి ఆర్మీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఇద్దరూ కలిసి ట్యాంకర్‌పై షికారు చేస్తూ లైవ్ ఫైరింగ్ డ్రిల్స్‌ను పర్యవేక్షించారు. యుద్ధ సన్నాహాలను వేగవంతం చేయాలని కిమ్ సైన్యానికి పిలుపునిచ్చారు. జు ఏ వరుసగా సైనిక కార్యక్రమాల్లో కనిపిస్తుండటంతో, తననే కిమ్ వారసురాలిగా ప్రకటిస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.