పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు
MDK: మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ (అగ్రహారం) గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. సర్పంచ్ అంబపురం వెంకటేష్ ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో శిబిరం నిర్వహించి 246 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఎల్ఎస్ఏ రాజ్ రెడ్డి, ఓఎస్ చిరంజీవి, రైతులు పాల్గొన్నారు.