VIDEO: దళితులకే పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నారు
WGL: నల్లబెల్లి మండలంలోని రంగాపురం GPలోని పారిశుద్ధ పనులు కేవలం దళిత మల్టీ పర్పస్ కార్మికులే నిర్వహిస్తున్నారని DTVV జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య ఆరోపించారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కారోబార్ వ్యవస్థ రద్దు చేసి, ప్రతి ఒక్కరూ యూనిఫామ్‌తో పనులు చేయాలి కానీ దానికి భిన్నంగా పనిచేస్తున్నారని అన్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.