వాల్యాతండ, చివ్వేంల రహదారి మూసివేత

వాల్యాతండ, చివ్వేంల రహదారి మూసివేత

SRPT: చివ్వేంల మండలం వాల్యాతండ గ్రామం నుండి చివ్వేంలకు వెళ్లే రహదారిపై పెద్ద చెరువు అలుగు పొంగిపొర్లింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువు నిండిపోవడంతో నీరు రహదారి పైకి ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు ముందస్తుగా ప్రమాదాలు జరగకుండా రోడ్డును మూసివేశారు.