నేడు కేవీబీపురంలో ఎమ్మెల్యే పర్యటన

TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేవీబీపురం మండలంలో బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుంటారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.5.07 కోట్ల మెగా చెక్కు అందజేస్తారు. తర్వాత అన్నదాతలకు సబ్సిడీపై నవధాన్యాలు, పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయనున్నారు.