కర్నూలుకు చేరుకున్న ఆర్థిక శాఖ మంత్రి
KRNL: ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, పూలమొక్కను అందజేసి మంత్రిని ఆత్మీయంగా ఆహ్వానించారు. అనంతరం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత ప్రాజెక్టులు మరియు ఇతర కీలక అంశాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు.