అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

KMR: బిచ్కుంద మండలంలోని సీర్సముందర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మహనీయుని విగ్రహాన్ని తన చేతులు మీదుగా ఆవిష్కరించడం తనకెంతో గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు