సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన కౌన్సిలర్
MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే పట్టణాలు అభివృద్ధిలోకి వస్తున్నాయని చెన్నూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అన్నారు. సోమవారం 2, 9వ వార్డులలో నూతన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. స్వచ్ఛ మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు పట్టణం వాసులందరూ పూర్తిగా సహకరించాలని కోరారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.