షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

GTR: శుక్రవారం ఉదయం మాచర్ల పట్టణంలోని ఓ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కరెంట్ మీటర్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పటానికి ప్రయత్నించగా మంటలకు గ్యాస్ సిలెండర్, ఏ.సి బాక్స్ కాలిపోయి పెద్ద శబ్దంతో ఇళ్లంతా వ్యాపించాయి. స్థానికులు భయాందోళన గురయ్యారు. వారి సమాచారంతో హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో తెచ్చారు.