విజయవాడలో రేపు 'మ్యూజికల్ నైట్'
ఎన్టీఆర్: విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో రేపు రాత్రి సంగీత ఝరి( మ్యూజికల్ నైట్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రముఖ గాయకులు ఎస్పీ చరణ్, సునీత తదితరులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. రేపు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై గురువారం అధికారులతో వర్చువల్‌గా సమీక్షించారు. నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తామని పేర్కొన్నారు