అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువుల బ్యాగులు సీజ్

KRNL: మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలోని శ్రీ బాలాజీ ఎంటర్ప్రైజెస్ దుకాణాన్ని ఎమ్మిగనూరు ఏడీఏ మహమ్మద్ ఖాద్రి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఫ్యాక్ట్ 200 సంచులు, 10:26:26 25 బ్యాగులు, 15:15:15 165 బ్యాగులు సీజ్ చేసినట్లు తెలిపారు. యూరియాను అధిక రేట్లకు అమ్మితే చర్యలు తప్పవన్నారు. తనిఖీల్లో AO తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.