ఉక్రెయిన్‌పై 1000 డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్‌పై 1000 డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1000 డ్రోన్లు, 34 క్షిపణులతో దాడి చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో గగనతల దాడి చేయడం ఇదే తొలిసారి. తమ దేశంలోని 550కిపైగా ప్రాంతాలను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ఆ దేశం పంపిన వాటిల్లో 541 డ్రోన్లను కూల్చేసినట్లు తెలిపారు.