ప్రజల ముంగిటకే పాలన: కలెక్టర్ వినోద్

ప్రజల ముంగిటకే పాలన: కలెక్టర్ వినోద్

BPT: అధికారులు విధులకు పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో దివ్యాంగులు, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 'బాపట్ల సేవా సేతు'తో ప్రజల వద్దకే పాలన తెస్తున్నామన్నారు. తాగునీటి ఎద్దడిపై యాక్షన్ ప్లాన్, వృద్ధుల హక్కుల కరపత్రాలు విడుదల చేశారు.