ముంపు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్
WGL: పట్టణ పరిధిలోని 29వ డివిజన్ రామన్నపేట ప్రాంతాన్ని గురువారం రాత్రి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కమిషనర్ చావత్ బాజ్‌పాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరద ప్రభావిత వీధులను ప్రత్యక్షంగా పరిశీలించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వరద భాదితులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.