KTR పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

BHPL: మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.