బొలోరో ఢీకొని ఒకరు మృతి..ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నమయ్య: రాయచోటి సమీపంలోని అనుంపల్లి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశ్వనాథ (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. SMB చికెన్ షాప్‌కు చెందిన బొలెరో టెంపో అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షేక్ షా (27), నాగూర్ (25) అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.