9న జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు
SKLM: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 9న U12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలుంటాయని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లెల శాస్త్రి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆదివారం ఉ.8:30 గంటలకు జనన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. 2013 సెప్టెంబరు1- 2025 ఆగస్టు 31 తేదీ మధ్య జన్మించి ఉండాలని స్పష్టం చేశారు.