గోదావరికి పెరుగుతున్న వరద

MLG: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 12.98 మీటర్లకు నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎగువ బ్యారేజీల నుంచి అధిక మొత్తంలో నీటిని విడుదల చేశారని, దీంతో పుష్కర ఘాట్ వద్ద వరద పెరుగుతుందన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.