'రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి'
MNCL: రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని జన్నారం మండల పోలీసులు సూచించారు. జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పోలీసులు 'అలైవ్- అరైవ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.