ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద పాము హల్‌చల్

SKLM: నరసన్నపేట మండలం అంపలాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద పాము హల్‌చల్ చేసింది. బుధవారం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయురాలు పుణ్యవతి పాఠశాలకు వెళుతుండగా పాఠశాల ముందు రక్తపింజరి అనే పాము కనబడడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అక్కడికి చేరుకుని ఆ పామును చంపేశారు. ఇది చాలా ప్రమాదకరమైన పాము అని వారు తెలిపారు.