'దేశ రాజధానిలో యువత ప్రతిభను చాటాలి'
PPM: దేశ రాజధాని ఢిల్లీలో పార్వతీపురం జిల్లా యువత క్రీడల్లో తమ ప్రతిభను కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాస్థాయి యువజనోత్సవాలను ఆయన ప్రారంభించారు. తమ సత్తా చాటి ప్రతిభ కనబరిస్తే అన్ని సౌకర్యాలు తాను ఏర్పాటు చేస్తామన్నారు.