పార్టీలో కలుపు మొక్కలు ఉన్నాయి: AICC కార్యదర్శి
TG: AICC కార్యదర్శి సంపత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పార్టీలో అక్కడక్కడా కలుపు మొక్కలు ఉన్నాయి.. వాటిని తీసేయాల్సిన అవసరం ఉంది. రెండేళ్ల క్రితం పార్టీలోకి వచ్చినవాళ్లు.. రెండేళ్ల తర్వాత ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు. మాలాంటి వాళ్లు చనిపోయే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటారు. మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అవసరం. పార్టీ పెద్దలు అవకాశమిస్తే వివరిస్తా' అని అన్నారు.