'మత్తడివాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత'

ADB: తాంసి మండలంలోని వడ్డడి గ్రామ సమీపంలో గల మత్తడివాగు ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తివేసినట్లు AE హరీష్ శనివారం తెలిపారు. మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన నీరు ప్రాజెక్టులోకి భారీగా చేరిందన్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం పెరగడంతో 5గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. దీంతో ప్రాజెక్టు వద్ద జలకళ సంతరించుకుంది.