ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు

VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమక్షంలో ఆదివారం మెరకముడిదాం మండలం బుదరాయవలస మాజీ సర్పంచ్‌ బాలి బంగారు నాయుడు, మాజీ MPTC బాలి చిన్నమ్మ వైసీపీని వీడి TDPలో చేరారు. వారితో పాటు సుమారు 300 మంది కార్యకర్తలు TDP కండువాలు కప్పుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరామని వెల్లడించారు.