VIRAL: కరెన్సీ నోట్లను విసిరేస్తూ యువకుల డాన్స్
పెళ్లి బరాత్‌లో యువకులు కరెన్సీ నోట్లను వెదజల్లుతూ హల్చల్ చేసిన ఘటన UPలో జరిగింది. కారుపైకి ఎక్కి నోట్లను విసిరేస్తూ వారు డాన్స్ చేయగా, రోడ్డుపై వెళ్తున్న వారంతా వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరెన్సీని ఇలా అవమానిస్తారా అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.