స్టార్టప్‌ల ప్రోత్సాహానికి కాంక్లేవ్

స్టార్టప్‌ల ప్రోత్సాహానికి కాంక్లేవ్

VSP: స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఈ నెల 18న నిర్వహించనున్న “సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్-ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ ఇన్వెస్టర్స్ కాంక్లేవ్” పోస్టర్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ఆవిష్కరించారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు మరియు స్టార్టప్ వ్యవస్థాపకులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.