VIDEO: రైల్వే స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యయత్నం
HNK: కాజీపేట రైల్వే స్టేషన్‌లో నిన్న దారుణ ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్‌ఘఢ్ నుంచి అమీనాబాద్ వెళ్లాల్సిన విజయ్ కుమార్ (30) దారి తప్పి కాజీపేట రైల్వే స్టేషన్‌లో దిగాడు. స్టేషన్‌లో రైల్వే పోలీసులను కలిసి దారి తప్పానని చెప్పిన కాసేపటికే స్టేషన్ పక్కనే గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.