కోస్గి తహశీల్దార్ కార్యాలయానికి కలెక్టర్

కోస్గి తహశీల్దార్ కార్యాలయానికి కలెక్టర్

నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం కోస్గి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. 'భూభారతి' పథకం అమలులో భాగంగా కోస్గిని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడంతో, ఆ ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని సౌకర్యాలను పరిశీలించిన ఆయన, భూభారతి అమలులో సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, అధికారులు పాల్గొన్నారు.